ఉప్పుగూడ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో సైన్స్ ఫెయిర్
విశ్వంభర, శివాజీ నగర్, ఉప్పుగూడ :-శివాజీ నగర్ ఉప్పుగూడలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం డైరెక్టర్ కె తిరుమల్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ జి రామకృష్ణ యాదవ్ ప్రారంభించారు. ప్రిన్సిపల్ డి భాస్కర్ మాట్లాడుతూ పిల్లలకు నైపుణ్యత శిక్షణ ఇవ్వడం మా యొక్క స్కూల్ ప్రత్యేకత అని గత పది సంవత్సరాల నుండి 10వ తరగతిలో మంచి ఫలితాలను సాధిస్తూ దూసుకుపోతున్న మా స్కూల్ యాజమాన్యానికి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమానికి K తిరుమల్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ G రామకృష్ణ యాదవ్ రావడం చాలా సంతోషంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోవిద్యార్థిని, విద్యార్ధిలు, తల్లిదండ్రులు,ఉపాధ్యాయ ని , ఉపాధ్యాయులు పాల్గొని విజయ వంతం చేసారు. విద్యార్థిని, విద్యార్థులు కూడా ఇలాంటి నైపుణ్య కార్యక్రమాలు చేయడం వల్ల ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.



