భారీ వర్షం.. డీఆర్‌ఎఫ్ సేవలు ముమ్మరం
విశ్వంభర, హైదరాబాదు : నగరంలో కురిసిన భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బేగంపేట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ట్యాంక్‌బండ్, సచివాలయం ముందు రహదారులపై మోకాళ్ల లోతు వరకు నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్ వైపు ట్యాంక్‌బండ్‌పై చెట్టు పడిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. నిలిచిన వర్షపు నీటిని తొలగించడం, రహదారులపై పడిన చెట్లను తొలగించడం వంటి పనులను డీఆర్‌ఎఫ్ బృందాలు చేపట్టాయి. శేరిలింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి, షేక్‌పేట, టోలిచౌకి, మాధాపూర్, సికింద్రాబాద్, హైదరగూడ ప్రాంతాల్లో డీఆర్‌ఎఫ్ సిబ్బంది సేవలు కొనసాగిస్తున్నారు. నగరవ్యాప్తంగా దాదాపు 76 చోట్ల పడిపోయిన చెట్లను తొలగించే పనులు కొనసాగాయి.