ప్రమాణ స్వీకారం అనంతరం తొలి అభివృద్ధి పనికి శ్రీకారం చుట్టిన సర్పంచ్ ఉల్లి నరేష్ కుమార్ 

ప్రమాణ స్వీకారం అనంతరం తొలి అభివృద్ధి పనికి శ్రీకారం చుట్టిన సర్పంచ్ ఉల్లి నరేష్ కుమార్ 

విశ్వంభర, కౌకుంట్ల :-  గ్రామ అభివృద్ధికి తొలి అడుగుగా 12వ వార్డులో కొత్త విద్యుత్ లైన్ ఏర్పాటు పనులను ప్రారంభించిన సర్పంచ్ ఉల్లి నరేష్ కుమార్. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ రావు,ఉప సర్పంచ్ లక్ష్మీకాంత్ రావు , వార్డు మెంబర్ కావలి అంజమ్మ, పంచాయతీ కార్యదర్శి బుచ్చన్న , విద్యుత్ శాఖ అధికారి కుమ్మరి నర్సింహులు,  వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ అవసరాలను ముందుగా గుర్తించి,త్వరిత పరిష్కారాల దిశగా అడుగులు వేస్తున్న నూతన పాలనకు ఇది ఒక శుభారంభం  అని అన్నారు. 

 

Tags: