రూ.20 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాపై హైడ్రాకు ఫిర్యాదు

  • బంగారు మైసమ్మ దేవాలయ చైర్మన్ బోబ్బల లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు

విశ్వంభర, బోడుప్పల్: మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్‌లో సర్వే నంబర్ 262లో ఉన్న సుమారు రూ.20 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోగుల వీరారెడ్డి, పులకండ్ల బాల్‌రెడ్డి హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, బంగారు మైసమ్మ దేవాలయ చైర్మన్ బోబ్బల లక్ష్మారెడ్డి ప్రభుత్వ భూమిని ఆక్రమించి షెడ్లు నిర్మించి, గత పదేళ్లుగా అద్దెలు వసూలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై సంబంధిత ప్రభుత్వ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీంతో చివరి ప్రయత్నంగా హైడ్రా కమిషనర్‌ను ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ మేరకు పోగుల వీరారెడ్డి, పులకండ్ల బాల్‌రెడ్డి సంయుక్తంగా హైడ్రా అధికారులకు వినతిపత్రం సమర్పించారు. తమ ఫిర్యాదులో సర్వే నంబర్ 262లోని ప్రభుత్వ భూమిని బోబ్బల లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు అక్రమంగా ఆక్రమించి తమ ఆధీనంలో ఉంచుకొని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న భూమిని ఆక్రమించడం వల్ల ప్రభుత్వానికి భారీగా నష్టం జరుగుతోందని, సర్వే నంబర్ 262కు సంబంధించిన రెవెన్యూ రికార్డులు, ఇతర అధికారిక పత్రాలను పరిశీలిస్తే ఆక్రమణల వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వారు తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని, అక్రమంగా నిర్మించిన షెడ్లను తొలగించాలని, ప్రభుత్వ భూమిని ఆక్రమించి అద్దెలు వసూలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్‌ను కోరినట్లు వెల్లడించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడి ప్రజా అవసరాలకు వినియోగించేలా తగిన చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు

🕒 26 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/complaint-to-hydra-on-seizure-of-rs-20-crore-government/article-19732

Tags: