ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: బీజేపీ

విశ్వంభర, బర్కత్ పుర : విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే డిమాండ్ చేశారు. హైదరాబాదు బర్కత్ పురలోని అవంతి కళాశాల వద్ద బీజేపీ హైదరాబాదు సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన "ఫీజుల బకాయి–బీజేపీ లడాయి" సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడకుండా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. లంకల దీపక్ రెడ్డి మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి విద్యార్థులు బకాయిల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని, ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో: రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడెల్లి అజయ్ కుమార్, చిట్టి శ్రీధర్, కన్నె రమేష్ యాదవ్, మోత్కుల శ్యామ్ రాజ్, గంగరాజు, ఎక్కల కన్నా, భుజేందర్, ఉమారాణి, అమృత, వనం రమేష్, అడపా చంద్రమౌళి, జ్యోతి, నాగమణి, నీరజ, నితిన్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

🕒 26 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bjp-should-release-fee-reimbursement-arrears/article-19715

Tags: