బోయలపల్లిలో గొర్రెల మందపై చిరుత దాడి.. అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక
అనంతపురం జిల్లా బోయలపల్లిలో గొర్రెల మందపై చిరుత దాడి.
15 గొర్రెలు మృతి చెందగా సుమారు రూ.1 లక్ష ఆస్తి నష్టం.
Andhra Pradesh News: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో చాకలి కిష్టప్పకు చెందిన గొర్రెల మందపై చిరుత ఒక్కసారిగా దాడి చేసి 15 గొర్రెలను చంపేసింది. ఈ ఘటనతో గొర్రెల కాపరులు, గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎ. మల్లికార్జున, వైల్డ్‌లైఫ్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. చిరుత అడుగుజాడలను గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో సుమారు రూ.1 లక్ష మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
గ్రామ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, పశువులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని అటవీశాఖ అధికారులు సూచించారు. చిరుత కనిపిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు.