సీఎం వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధం

విశ్వంభర, హైదరాబాదు : ఓటరు నమోదును ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ముడిపెట్టి ప్రజలను ప్రభావితం చేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సంఘ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ వేముల, కమిటీ సభ్యుడు ఏడెల్లి అజయ్ కుమార్ సమర్పించిన వినతిపత్రంలో, గ్రామంలో ఓటరుగా నమోదు కాకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవని చెప్పడం ఎన్నికల చట్టానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఓటరు గుర్తింపు కార్డు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తప్పనిసరి కాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెంటనే ప్రజలకు స్పష్టత ఇవ్వాలని, ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ కోరింది.

🕒 26 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/cms-comments-are-against-election-rules/article-19711

Tags: