కాంగ్రెస్ లో చేరిన దిర్సంపల్లి గ్రామ సర్పంచ్

కాంగ్రెస్ లో చేరిన దిర్సంపల్లి గ్రామ సర్పంచ్

 విశ్వంబర, దోమ: మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామ  బీఆర్‌ఎస్ పార్టీ కి చెందిన సర్పంచ్ విజయలక్ష్మి వెంకట్ రాములు పరిగి పట్టణంలో  ఎమ్మెల్యే  టి.రామ్మోహన్ రెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే  టి.రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ,  కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐకమత్యంగా  పార్టీ పటిష్టతకు కృషి చేయాలని తెలిపారు.  విజయలక్ష్మి వెంకట్ రాములు మాట్లాడుతూ,  అధికార పార్టీలో ఉంటేనే గ్రామాభివృద్ధి వేగంగా సాధ్యమవుతుందని, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిగి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై విశ్వాసంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పి ఎ సి ఎస్ చైర్మన్ యాదవ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాఘవేందర్ రెడ్డి, యాదయ్య గౌడ్, ప్రభాకర్ రెడ్డి, రాములు గౌడ్, సత్తయ్య,తదితరులు పాల్గొన్నారు.

Tags: