రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని పాదయాత్ర
On
విశ్వంభర, చండూరు: మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కాలని కాంక్షిస్తూ నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన ముష్టిపల్లి లింగస్వామి పాదయాత్ర నిర్వహించారు. ముష్టిపల్లి గ్రామం నుండి నల్గొండ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర దేవస్థానం వరకు ఈ యాత్ర సాగుతోంది. లింగస్వామి చేపట్టిన ఈ పాదయాత్ర సోమవారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో లతీఫ్ పాషా, సరికొండ వెంకన్న, మహమ్మద్ జానీ, యాదగిరి మరియు పలువురు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



