అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు 

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు 

విశ్వంభర, ప్రకాశం జిల్లా:  ప్రకాశం జిల్లా కందుకూర్ గ్రామం ప్రైవేట్ ఆసుపత్రుల్లో  అధిక పరీక్ష ఫీజులు వసూలు చేస్తున్నారని, ఆసుపత్రి ప్రాంగణంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలని డిమాండ్ చేస్తూ   యం. ఆర్. మానవ హక్కుల సంఘం నాయకులూ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మానవ హక్కుల జాతీయ అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి, అలాగే బోర్డు డైరెక్టర్ రోడ్డా తిరుపతయ్య కలిసి  డిఎం అండ్ హెచ్ఓ ని మర్యాదపూర్వకంగా కలసి సమస్యలను వివరించారు. ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు సాధారణ ప్రజలపై భారంగా మారేలా ప్రతి టెస్ట్‌కు అధిక రుసుములు వసూలు చేస్తున్నాయని  పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లను పాటించకుండా ఇష్టానుసారంగా ఛార్జీలు విధించడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోప్రతి ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రభుత్వం నిర్ణయించిన టెస్ట్ ల ధరల పట్టికను స్పష్టంగా ప్రదర్శించాలని,  అధిక ఫీజులు వసూలు చేసే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు పారదర్శక వైద్య సేవలు అందేలా పర్యవేక్షణ పెంచాలని కోరారు. ఈ వినతిపత్రంపై సానుకూలంగా స్పందించిన డిఎం అండ్ హెచ్ఓ సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ప్రెసిడెంట్ ఎస్టీ బాషా, వైస్ ప్రసిడెంట్ షేక్ సలాం, సెక్రటరీ నరేంద్ర,  ఉమెన్స్ వింగ్ కన్వీనర్ పి.మాధవి, ఉమెన్స్ వింగ్ కన్వీనర్ షేక్ మౌలాబి, ఉలవపడు మండల ప్రసిడెంట్ కృష్ణ, తడితరులు పాల్గొన్నారు.

Tags: