ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… కాక్రోచ్ జనతా పార్టీకి తొలి విజయం : దిడ్డి సుధాకర్
విశ్వంభర, బషీర్ బాగ్: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాక్రోచ్ జనతా పార్టీ సాధించిన తొలి విజయమే తప్ప, ఉద్యమం ముగిసిందని భావించరాదనీ ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. దేశంలో విద్య, ఉపాధి, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ప్రారంభమైన విస్తృత ప్రజా ఉద్యమానికి నాంది మాత్రమనీ అన్నారు.కాక్రోచ్ జనతా పార్టీ కేవలం నీట్ పరీక్షలలో జరిగిన అవకతవకలు లేదా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం మాత్రమే ఏర్పడలేదనీ, దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, కోట్లాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత మనోభావాలు దెబ్బతినడంతో, అభిషేక్, దీపిక ఇచ్చిన చిన్న పిలుపుకు దేశవ్యాప్తంగా అపూర్వ స్పందన లభించిందన్నారు. ఆ స్పందనే ఉద్యమంగా రూపుదిద్దుకుని, కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావానికి కారణమైందన్నారు.దేశంలో విద్య, శాస్త్రీయ దృక్పథం, రాజ్యాంగ విలువలకు ప్రాధాన్యం తగ్గి, విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలు పెరుగుతున్నాయనే ఆందోళనతో వేలాది మంది యువకులు ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారనీ పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్, నీట్ పరీక్షలపై పోరాటం ఈ ఉద్యమానికి ఒక ప్రారంభ పరీక్ష మాత్రమే అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వేలాది మంది విద్యార్థులు లాఠీచార్జీలను, నిర్బంధాలను ఎదుర్కొన్నప్పటికీ వెనక్కి తగ్గలేదనీ, దేశవ్యాప్తంగా, విదేశాల్లో ఉన్న భారతీయుల నుంచి కూడా విశేష మద్దతు లభించిందనీ, ప్రధాన మీడియా తగిన ప్రాధాన్యం ఇవ్వకపోయినా, సోషల్ మీడియా ద్వారా ఈ ఉద్యమం ప్రజల్లోకి విస్తృతంగా చేరింది. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ మద్దతు ఉద్యమానికి మరింత బలాన్ని చేకూర్చిందన్నారు.ఈ సందర్భంగా ఉద్యమానికి నాయకత్వం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ నాయకులకు, ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు తెలిపిన విద్యార్థులకు, యువతకు, మేధావులకు, ప్రజాస్వామ్యవాదులకు, సోషల్ మీడియా కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.