50 ఏళ్లు నిండిన గీత పనివారలకు పింఛన్లు మంజూరు చేయాలి
విశ్వంభర, రామన్నపేట: గీత పనివారలు 20 ఏళ్లు నిండిన దగ్గర నుండి తాళ్ళెక్కుతూ తమ వృత్తిలో భాగంగా 50 ఏళ్ళు వచ్చేసరికి శరీరం పటుత్వం కోల్పోతుందని, నరాలు బలహీనపడి ఇతర పనులు చేసుకోవడానికి కూడా సహకరించవని అందు కోసమే 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలనే డిమాండును గీత పనివారల సంఘం ఆధ్వర్యంలో గతంలోనే సాధించుకోవడం జరిగిందని, ఆ జీవో విలువను గుర్తించి ప్రభుత్వం 50 ఏళ్లు నిండిన గీత పనివారలకు పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని గీత పని వారల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా సహాయ కార్యదర్శి, యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్న పేట మండలానికి చెందిన ఎర్ర రమేష్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా జీవో నెంబర్ 560 ప్రకారం గీత పనివారలకు తాటి చెట్లు, ఈత చెట్ల వనం పెంపకానికి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా మండలంలో గీత పనివారల సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో గీత పనివారల సంఘం మండల అధ్యక్షులు గంగాపురం వెంకటయ్య, సొసైటీ అధ్యక్షులు ఎర్ర వెంకటేశం, లగ్గోని యాదయ్య, బాలగోని మల్లయ్య, కూనూరు కృష్ణ, బాలగోని నరసింహ, భూపతి నరసింహ, గోపగోని సహదేవ్ బాలగోని శంకర్, కూనూరు నరసింహ, చెరుకు శివరాజ్ గుణగంటి కన్నయ్య, ఆకిటి శంకర్ తదితరులు పాల్గొన్నారు.