మేకలను దొంగిలిస్తున్న ముఠా సభ్యుల అరెస్ట్
On
విశ్వంభర, బొంరాస్ పేట్ : వికారాబాద్, మాహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో గొర్రెలు, మేకలను దొంగిలిస్తున్న ముఠాను బొంరాస్ పేట్ పోలీసులు పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా కారులో పారిపోతున్న సంజయ్ కుమార్, జగన్ లను అరెస్టు చేసినట్లు ఎస్ఐ వెంకటరమణ తెలిపారు. వీరి వద్ద నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు . బాధితులు తమ పశువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీ సులు సూచించారు.



