ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనే ఐక్యత

ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనే ఐక్యత

విశ్వంభర, సిద్దిపేట: గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని, మన సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడటంలో పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని యువ నాయకుడు వంగ రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రూరల్ మండలం బుస్సాపూర్ గ్రామంలో నిర్వహించిన  బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవానికి వంగ రాజేశ్వర్ రెడ్డి బుధవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. పండుగలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని సూచించారు. బీరప్ప ఆశీస్సులతో ప్రజలు సుఖ:శాంతులతో ఉండాలని కోరుకున్నారు.  అంతకముందు నిర్వాహకులు రాజేశ్వర్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో గ్రామస్తులు, నిర్వాహకులు పాల్గొన్నారు

Tags: