సంగారెడ్డి లో కార్మికుల కోసం అందుబాటులోకి  రానున్న  ఈఎస్ఐ   డిస్పెన్సరీ

సంగారెడ్డి లో కార్మికుల కోసం అందుబాటులోకి  రానున్న  ఈఎస్ఐ   డిస్పెన్సరీ

  • టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి వినతి మేరకు ఈఎస్ఐ డిస్పెన్సరీ మంజూరు చేసిన మంత్రి వివేక్ వెంకట స్వామి
  • బై పాస్ రోడ్ లో ఎంపీడీఓ ఆఫీస్ పక్కన ఉన్న ఆర్ అండ్ బి క్వార్టర్స్ లో  డిస్పెన్సరీ ఏర్పాటుకు నిర్ణయం
  • 8 లక్షల రూపాయలు స్వంత నిధులతో ఆర్ అండ్ బి క్వార్టర్స్ కు మరమ్మతులు చేయిస్తున్న జగ్గారెడ్డి
  • 10 బెడ్స్, 20 మంది సిబ్బంది తో ఈఎస్ఐ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం

విశ్వంభర, హైదరాబాద్ : సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల కార్మికులకు ఈఎస్ఐ డిస్పెన్సరీ మరి కొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి వినతి మేరకు కార్మిక శాఖా మంత్రి వివేక్ వెంకట స్వామి సంగారెడ్డి పట్టణానికి ఈఎస్ఐ డిస్పెన్సరీ మంజూరు చేశారు. డిస్పెన్సరీ ఏర్పాటుకు కావాల్సిన భవనం కోసం జగ్గారెడ్డి, నిర్మల గత కలెక్టర్   ప్రావీణ్య ను కోరారు. కలెక్టర్ ఆదేశాల మేరకు  బై పాస్ రోడ్ లో ఎంపీడీవో కార్యాలయం పక్కన ఉన్నవినియోగం లో లేని ఆర్ అండ్ బి క్వార్టర్ ను కేటాయించారు. డిస్పెన్సరీ ఏర్పాటుకు అవసరమైన మరమ్మత్తుల కోసం జగ్గారెడ్డి 8 లక్షల రూపాయల తన స్వంత నిధుల ను అందించారు. ప్రస్తుతం మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. జరుగుతున్న పనులను జగ్గారెడ్డి పరిశీలించారు. బెడ్స్ ఏర్పాటు కు, అవసరమైన ల్యాబ్, మెడిసిన్స్ ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. పక్కా భవనం ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.  సంగారెడ్డి పట్టణం లోనే డిస్పెన్సరీ ఏర్పాటు అవుతుండటం సంతోషకరం అని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి చుట్టుపక్కల పరిశ్రమ ల్లో పనిచేస్తున్న వేలాది కార్మికుల కు ఈ డిస్పెన్సరీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. మరమ్మత్తు పనులు సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసి , మంత్రులు వివేక్ వెంకట స్వామి, జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా ప్రారంభం చేస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, కాంగ్రెస్ నాయకులు జార్జ్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, మహేష్ ముదిరాజ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement