పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వెంకట్ రములు

పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వెంకట్ రములు

విశ్వంభర, పరిగి:  మండల పరిధిలోని గడిసింగాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బీసీ నేత వెంకట్ రాములు ను పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వెంకట్ రములు మాట్లాడుతూ.. నాకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అవకాశం కల్పించిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసినట్లు తెలిపారు. పరిగి మండలంలోని ప్రతి గ్రామం, తండాలలో కాంగ్రెస్ పార్టీ పట్టిష్టతకు ఐకమత్యంగా కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకువెళ్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

Tags:  

Advertisement