కల్లుగీత కార్మికుల సహకార కార్పొరేషన్ చైర్మన్ గా బాడ్సీ శేఖర్ గౌడ్
విశ్వంభర, నిజామాబాద్ : రాష్ట్ర కల్లుగీత కార్మిక సహకార కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాడ్సి శేఖర్ గౌడ్ ను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మిఠాయిలు తినిపించి ఆనందం వ్యక్తంచేశారు.
భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. పార్టీలో కష్టపడ్డ వారికి ఉన్నతమైన స్థానాలు దక్కుతాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, ప్రధాన కార్యదర్శులు పొలసాని శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, రాంచందర్ గౌడ్, డివిజన్ నంబర్ 1 కార్పొరేటర్ అగ్గు భోజన్న,ధర్మాగౌడ్,హన్మండ్లు, ఆయా గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.



