అక్రమంగా టిప్పర్ లారీలలో నల్ల మట్టి తరలింపు.-పట్టుకున్న గట్టుప్పల్ ఎస్సై సంజీవ్ రెడ్డి
On
- యదేచ్ఛగా కొనసాగుతున్న మట్టి మాఫియా
- అనుమతులు లేకుండా లారీలలో పెద్ద ఎత్తున నల్ల మట్టి తరలింపు
- అక్రమంగా మట్టి తరలింపు - బుకాయిస్తూ పట్టబడ్డ లారీ వాహనదారులు
విశ్వంభర, ఉమ్మడి నల్లగొండ జిల్లా :- అక్రమంగా మట్టి తరలిస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా దాదాపు 30 పైగా లారీల నల్ల మట్టి వాహనాలను ఉమ్మడి నల్గొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలో ఎస్సై సంజీవ్ రెడ్డి సమక్షంలో లారీలను ఆపి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వీటిపై ఇలాంటి అనుమతులు లేకుండా నల్ల మట్టిని తరలించే వాహనాలను పట్టుకొని గట్టుప్పల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వలిగొండ నుంచి ఈ నల్ల మట్టిని శివన్న గూడెం మర్రిగూడెం వంటి ప్రాంతాలలో టిప్పర్ లారీల ద్వారా అనుమతులు లేకుండా తరలిస్తున్నారని సమాచారం. దాదాపుగా 30కి పైగా టిప్పర్ లారీలను పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంచబడ్డాయి. దీనిపై ఎస్ఐ సంజీవ్ రెడ్డి విచారణ చేస్తూ పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.



