బడా నేతల అండతోనే భూకబ్జా

బడా నేతల అండతోనే భూకబ్జా

  • - మల్లేశ్ కుటుంబాన్ని ఆదుకుంటా
    - యువ నేత వంగ రాజేశ్వర్ రెడ్డి 
    - బాధితుడిని పరామర్శించిన వంగ

విశ్వంభర, సిద్దిపేట: సిద్దిపేటను ఏలుతున్న ఓ బడా నేత తీరు చూస్తుంటే 'ఉల్టా చోర్.. కొత్వాల్ కో డాంటే' అన్నట్టుగా ఉందని యువ నేత వంగ రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. అంగ బలం, అర్థబలం చూసుకుని రూరల్ మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన గ్యార మల్లేశ్ భూమిని, సిద్దిపేట బడా నేత అనుచరులు, అధికారులు కలిసి అక్రమంగా కబ్జా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఘవపూర్ గ్రామానికి చెందిన గ్యార మల్లేశ్ కుటుంబాన్ని రాజేశ్వర్ రెడ్డి బుధవారం పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి, భూ సమస్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. అనంతరం మాట్లాడుతూ చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుని ఇలాంటి పనులు చేసే నాయకులు, అధికారులు సమాజానికి అత్యంత ప్రమాదకరమని ఆవేదన వ్యక్తంచేశారు. అక్రమ రిజిస్ట్రేషన్‌లో ఎంత పెద్ద రాజకీయ నాయకులైన, అధికారులున్నా విడిచిపెట్టామన్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్లైనా బాధితుడికి న్యాయం జరిగేలా చేస్తామని స్పష్టంచేశారు. బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తి భూమిని లాక్కోవడం దుర్మార్గమని మండిపడ్డారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు సోషల్ మీడియాలో నాపై విష ప్రచారం చేస్తున్నారని, అలాంటి గుంటనక్క ప్రచారాలను ప్రజలు నమ్మరని చెప్పారు. నాపై తప్పుడు పోస్టులు పెట్టిన వారిని చట్టం ముందు నిలబెడతానని హెచ్చరించారు. మల్లేశ్ కుటుంబానికి అండగా ఉంటానని, హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో ఉచితంగా  వైద్యం అందిస్తానని చెప్పారు.

Tags: