గ్యాస్ ధరల పెంపుపై ఆప్ ఆగ్రహం

గ్యాస్ ధరల పెంపుపై ఆప్ ఆగ్రహం

విశ్వంభర, హైదరాబాదు : కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపు చిన్న వ్యాపారుల నడ్డి విరుస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర రాము గౌడ్ అన్నారు. ఆదివారం హైదరాబాదు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్యాస్ ధరల పెంపుతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీని ప్రభావం ఆహార పదార్థాల ధరలపై పడుతూ సామాన్యులపై అదనపు భారం మోపుతోందన్నారు. ఎన్నికల సమయంలో ధరల పెంపుపై మౌనం వహించి, అనంతరం భారాన్ని మోపడం ప్రజలను వంచించడమేనని విమర్శించారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించు కోవాలని, సబ్సిడీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10న హైదరాబాదులో జరగనున్న సభ సందర్భంగా ప్రజలు ప్లకార్డులతో నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. ధరల పెంపును వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Tags:  

Advertisement