పరిసరాల పరిశుభ్రతకు కృషి చేయాలి

పరిసరాల పరిశుభ్రతకు కృషి చేయాలి


  • : మున్సిపల్ చైర్ పర్సన్ రజిత వెంకటేష్

విశ్వంభర, పరిగి: మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ రజిత వెంకటేష్ జెసిపి సహాయంతో దగ్గరుండి పారిశుద్ధ్య పనులను చేయించడం జరిగింది. ఈ సందర్భంగా రజిత వెంకటేష్ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పేర్కొన్నారు. తడి, పొడి చెత్తను మున్సిపాలిటీ వాహనంలో వేరువేరుగా వేయాలన్నారు. మురుగు కాలువల కలరా, డెంగ్యూ ,మలేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, నాయకులు పాల్గొన్నారు

Tags:  

Advertisement