జిలుకర ఏకాంతం సేవలు అమోఘం
విశ్వంభర, హనుమకొండ: హనుమకొండ ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో పనిచేస్తున్న జిలుకర ఏకాంతం పదవీ విరమణ ఆత్మీయ సన్మాన అభినందన సభ పాఠశాల ఆవరణలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీవీ రమేష్ లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు సహచర ఉపాద్యాయులు, బంధుమిత్రులు జిలుకర ఏకాంతం విద్యార్థులకు చేసిన సేవలు అమోఘమని కొనియాడారు. వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు.అ నంతరం జిలుకర ఏకాంతం మీడియాతో మాట్లాడుతూ, గత 27 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉపాద్యాయుడుగా వృత్తినే దైవంగా బావిస్తూ, ఎంతోమంది విద్యార్థులకు ఎంతో క్రమశిక్షణతో విద్యా బుద్ధులు నేర్పి, భావిభారత పౌరులుగా ఉన్నత శిఖరాలకు చేర్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు ఫిజికల్ డైరెక్టర్ శోభ, ఉపాద్యాయులు జ్యోతి,రాజ్ కుమార్,నరేందర్,ఉమ, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు, కందుకూరు వెంకటయ్య, యశోదా, జిలుకర శ్రీనాథ్ అలివేల, సాంబమూర్తి, శుభోధర, జిలుకర సాహిత్, సుస్మిత, సహర్శ్, జిలుకర విజేత, కుటుంబ సభ్యులు, సిబ్బంది, బంధుమిత్రులు, తదితరులు పాల్గొన్నారు.



