ఘనంగా పంతంగి లో హిందూ సమ్మేళనం
విశ్వంభర, చౌటుప్పల్: చౌటుప్పల్ మండల పరిధి అరేగూడెంలో పంతంగి ఉపమండలం హిందూ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మహిళ ప్రవచనకర్త కౌముది తంగిరాల, ఆర్ఎస్ఎస్ నల్గొండ విభాగ్ కార్యవహా మంత్రి ప్రగడ శ్రీధర్, అన్నపూర్ణేశ్వరి పీఠాధిపతులు శంకరనంద స్వామి లచే జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు బాతరాజు ఆగయ్య అధ్యక్షతన వహించారు. ఈ సందర్బంగా అన్నపూర్ణేశ్వరి ఆశ్రమ పీఠఅధిపతులు శంకరనంద స్వామి అనుగ్రహ భాషణం చేశారు. తల్లితండ్రులు కుటుంబంలో భారతీయ సంస్కృతినీ నేర్పించాలి.చరవాణిలు వీడి పిల్లలకు ధర్మం బోధించాలి.ప్రతి ఇంటిపై కాషాయ ధ్వజం ఎగురవేయాలి. భారతదేశాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలి.ఔత్సహిక మహిళ ప్రవచన కర్త కౌముది తంగిరాల మాట్లాడుతూ.. దైవభక్తి కంటే దేశభక్తి గొప్పది అని అన్నారు. పంచిపరివర్తన్ వ్యక్తిగత జీవితంలో ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. మనిషి అంటే శరీరం మాత్రమే కాదు సమిష్టి అని తెలిపారు. ఆత్మ సుఖ త్యాగం ద్వారా లభిస్తుందన్నారు. సంసృతి సంప్రదాయలు అలవాటు చేసుకొని కుటుంబంలోనీ పిల్లలకు నేర్పించాలన్నారు. కార్యక్రమంలో హిందూ సమ్మేళన సమితి సభ్యులు, ఉపమండల ప్రజలు పాల్గొన్నారు.



