నిరుపేదల ముఖంలో చిరునవ్వు చూడడమే గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యం.-గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, అరుణ దంపతులు 

నిరుపేదల ముఖంలో చిరునవ్వు చూడడమే గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యం.-గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, అరుణ దంపతులు 

  • నిరుపేదలకు సేవ చేయడంలో ఉన్న ఆనందం... మరెక్కడా లభించదు...
     
  •  నిరుపేదల పక్షపాతి గాంధీజీ ఫౌండేషన్
     
  •  గాంధీజీ ఫౌండేషన్ వారి 29వ నెల సరుకుల పంపిణీ 

  • ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ ఆశయం....

విశ్వంభర, చండూర్ :  ప్రతినెల 30 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్ దంపతులు 2024వ సంవత్సరం జనవరి నెల ఒకటో తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో "నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ" కార్యక్రమం మంగళవారం నాడు స్ధానిక గాంధీజీ విద్యాసంస్థల యందు  29వ నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, అరుణ దంపతులు మాట్లాడుతూ మా జీవితం ఉన్నంతవరకు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ తో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ, సమాజంలో ఆదర్శవంతంగా జీవిస్తామని, ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాక వారి ముఖంలో చిరునవ్వు చూడడమే  గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యమని  అన్నారు. గాంధీజీ ఫౌండేషన్ పేదల పక్షపాతి అని, ప్రాణం ఉన్నంతవరకు నిరుపేదలకు సేవ చేస్తూనే ఉంటామని, పేదలకు సేవ చేయడంలో ఉన్న ఆనందం మరి ఎక్కడ లభించదని అన్నారు.మా గాంధీజీ విద్యాసంస్థల ద్వారా తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులకు చాలా తక్కువ ఫీజులతో విద్యనందిస్తున్నామని అన్నారు.  ఈ కార్యక్రమంలో  గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, గాంధీజీ విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్ పులిపాటి రాధిక, చిలుకూరి రామేశ్వరి, బోడ యాదయ్య, బుషిపాక యాదగిరి, బోడ విజయ్,గోపి తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews

నిరుపేదల ముఖంలో చిరునవ్వు చూడడమే గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యం.-గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, అరుణ దంపతులు 
కుప్పకూలిన రైతులు -వడ్లు, మక్కలు, జొన్నలు కొనకుండా కాంగ్రెస్ సర్కార్‌ చెలగాటం - కంచర్ల కృష్ణారెడ్డి BRS రాష్ట్ర నాయకులు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో  ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం . -చేవెళ్ల నియోజకవర్గం లేబర్ సెల్ (INTUC) ప్రధాన కార్యదర్శి భానూరి శివశంకర్ గౌడ్ తీవ్ర ఆరోపణలు
సమయానికి తెరవని షాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి – రోగులకు తీవ్ర ఇబ్బందులు
పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వెంకట్ రములు
పరిసరాల పరిశుభ్రతకు కృషి చేయాలి
మేకలను దొంగిలిస్తున్న ముఠా సభ్యుల అరెస్ట్