హుస్నాబాద్‌లో క్రీడా వారోత్సవం ప్రారంభం
విశ్వంభర, హుస్నాబాద్: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 18 నుంచి మే 23 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రీడా వారోత్సవాన్ని పురస్కరించుకుని హుస్నాబాద్‌లో 2కే మారథాన్ రన్ నిర్వహించినట్లు మండల విద్యాధికారి బండారి మనీలా తెలిపారు. యువతలో క్రీడల అభివృద్ధి, ఫిజికల్ లిటరసీపై అవగాహన కల్పించేందుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర హుస్నాబాద్ నుంచి మినీ స్టేడియం వరకు మారథాన్ నిర్వహించారు. ఈ రన్‌ను ఎంఈఓ తో కలిసి కాంప్లెక్స్ హెచ్‌ఎం కే. వాసుదేవ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పీఎం శ్రీ బాలికల పాఠశాలలో క్రీడాకారులకు యోగ, మెడిటేషన్, యోగాసనాలపై పీడీ ఆర్. శ్రీనివాస్ సాధన చేయించారు.ఈ కార్యక్రమంలో బాలికల జడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం గంగిశెట్టి మహేందర్, పీడీలు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్, బ్యాడ్మింటన్ కోచ్ దిలీప్ ఠాకూర్, కబడ్డీ కోచ్ కృష్ణ, ఉపాధ్యాయుడు రవి, సీనియర్ క్రీడాకారుడు రిశ్వంత్‌తో పాటు పలువురు క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.