పాడుబడిన ప్రాథమిక పాఠశాల వంటగది కి మరమ్మత్తులు చేయించండి

పాడుబడిన ప్రాథమిక పాఠశాల వంటగది కి మరమ్మత్తులు చేయించండి

03

విశ్వంభర, ఆమనగల్లు జూలై 11 :-   తలకొండపల్లి ప్రాథమిక పాఠశాలలో వంటశాల గది శిఖలావస్థకు చేరుకున్న ది . వంటశాల లేక  విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురికావడం జరుగుతుంది, పై కప్పు రేకులు కూలిపోవడం వల్ల, వర్షం సమయంలో కట్టెలు తడిసి విపరీతమైన పొగ వల్ల స్కూల్ ప్రాంగణం అంతా పొగ చూరుతుందని వర్షం వల్ల  విద్యార్థులకు భోజన  సమయానికి వంట కాకపోవడం వల్ల విద్యార్థులు పస్తులు ఉండటం, నేలపై కూరగాయలు కోయడం వల్ల రాళ్లు రావడం, వంటశాల రూమ్ తలుపులు, కిటికీలు లేక భద్రత లేకపోవడం, పంది కొక్కుల రంద్రాల వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. కావున వెంటనే పాఠశాల వంటగది మరమ్మత్తులు చేయించాలని కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ పద్మా అనిల్ కోరారు

Read More మూడవ రోజు కొనసాగుతున్న మధ్యాహ్న భోజన కార్మికుల నిరసనలు