సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం
విశ్వంభర, అబిడ్స్: తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి ఆధ్వర్యంలో శనివారం అసెంబ్లీ ఎదుట గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి పూలాభిషేకం నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఉద్యమకారులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సుల్తాన్ యాదగిరి మాట్లాడుతూ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు జారీ చేయడం, ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడం, అమరుల స్మారకార్థం స్మృతివనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా 250 గజాల ఇంటి స్థలం కేటాయిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారని తెలిపారు. ఈ నెలాఖరులోపు సమస్యల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం వెల్లడించిందన్నారు. 1969 ఉద్యమంలో 369 మంది, తరువాతి దశల్లో సుమారు 1200 మంది వరకు ఆత్మబలిదానాలు చేసుకున్నారని గుర్తుచేశారు. ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోత్కూరి మల్లేష్, శ్యామల, రాజు గౌడ్, శ్రీశైలం, చారి, కృష్ణ, వెంకటయ్య, చందర్ తదితరులు పాల్గొన్నారు.



