పట్టణాభివృద్ధికి కట్టుబడి ఉంటాం
On
- మున్సిపల్ చైర్‌పర్సన్ సుధా బాలకృష్ణ
విశ్వంభర, మిర్యాలగూడ: మిర్యాలగూడ మున్సిపాలిటీలో శనివారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వార్డులలో ఉన్న ప్రస్తుత సమస్యలు, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, వాటి సమర్థవంతమైన అమలు విధానాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ప్రభుత్వ పథకాలు అన్నీ ప్రతి వార్డులో సకాలంలో, పారదర్శకంగా అమలయ్యేలా చూస్తామని చైర్‌పర్సన్ సుధా బాలకృష్ణ హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ,మున్సిపల్ పరిధిలోని వివిధ రంగాలలో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పనులు చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.



