ఘనంగా ప్రారంభమైన "ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక" కార్యక్రమం -మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు
On
విశ్వంభర, చండూరు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపడుతున్న “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక (99 డేస్ యాక్షన్ ప్లాన్ ) కార్యక్రమము చండూరు మున్సిపాలిటీ కేంద్రం వద్ద శుక్రవారం ఉదయం: 9.00 గంటలకు మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన ఉన్న గెస్ట్ హౌస్ లో ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, మున్సిపల్ సిబ్బంది మరియు పట్టణ ప్రజలచే కార్యక్రమము ప్రారంభించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా తేది: 06.03.2026 నుండి 15.03.2026 వరకు మున్సిపాలిటీ ప్రతి వార్డులో నిర్వహించే స్పెషల్ సానిటేషన్ డ్రైవ్, పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ మరియు రోజు వారిగా చేసే కార్యకలాపాలను మున్సిపల్ కమీషనర్ ఎల్. మల్లేశం వివరించడం జరిగింది. చైర్‌పర్సన్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ మున్సిపాలిటీ అన్ని వార్డులలో దోమల నివారణకు ఫాగింగ్ చేస్తున్నామని, ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ లో భాగంగా అన్ని వార్డులలో బ్లీచింగ్ చేయిస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమములో చైర్ పర్సన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు , వైస్ చైర్ పర్సన్ భూతరాజు దశరథ, మున్సిపల్ కమీషనర్ ఎల్. మల్లేశం, కౌన్సిల్ సభ్యులు తెలుకుంట్ల రాజకుమారి, బుషిపాక వాసు, సామ సుజాతయాదవ్ రెడ్డి, జెల్ల ధనమ్మశీను, కోన్రెడ్డి మధు, కోడి సుష్మవెంకన్న, కలిమికొండ పారిజాత జనార్ధన్ , కటకం రమేష్ , కాంగ్రెస్ జిల్లా నాయకుడు ఐతరాజు మల్లేష్, జున్ను, మున్సిపల్ సిబ్బంది, మహిళా సంఘ సభ్యులు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.



