చేవెళ్ల అభివృద్ధి పనులపై సీఎం నీ కలిసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య*
విశ్వంభర, చేవెళ్ల: చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తూ చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గంలో చేపట్టవలసిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే యాదయ్య విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న రహదారి నిర్మాణాలు, తాగునీటి సమస్య పరిష్కారం, విద్యా మరియు వైద్య సదుపాయాల విస్తరణ వంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే యాదయ్య కోరారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.అలాగే చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందించాలని ఎమ్మెల్యే యాదయ్య విజ్ఞప్తి చేశారు.



