సాంఘిక సంక్షేమ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ స్నేహ శబరిష్

  • ఆగస్టు 3లోగా ఫారాలు పూర్తి చేయాలి.. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించాలి

విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ శనివారం మరిపెడ మండల కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించి ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) డిజిటలైజేషన్ ప్రక్రియతో పాటు నరసింహులపేట సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాల, వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ముందుగా ఎస్‌ఐఆర్ సవరణ డిజిటలైజేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, తిరిగి అందని ఫారాల వివరాలను బీఎల్‌వోలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటిని సందర్శించి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీఎల్‌వోలు, సూపర్వైజర్లు, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి ఆగస్టు 3వ తేదీలోగా ఫారాల సమర్పణ పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం నరసింహులపేటలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల పాఠశాల, వసతి గృహాన్ని పరిశీలించిన కలెక్టర్ విద్యార్థినులతో ఆత్మీయంగా మాట్లాడారు. తరగతి గదులు, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, పాఠశాల పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, ఆహార నాణ్యతపై ఆరా తీశారు. ప్రభుత్వం నిర్దేశించిన డైట్ మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని, ప్రతి విద్యార్థికి అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగాహన కల్పించేలా బోధన సాగించాలని సూచించారు. ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని కూడా మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయుల హాజరు శాతం కచ్చితంగా ఉండేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారం అంశాలపై అవగాహన కల్పించాలని, విద్యార్థులతో పాటు భోజనం తయారు చేసే సిబ్బందికి కూడా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా బాలికల ఆరోగ్యం, మానసిక స్థితిగతులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఏవైనా సమస్యలు తలెత్తిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఉపాధ్యాయులు, అధికారులను కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశించారు.

🕒 26 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/collector-sneha-sabarish-inspected-the-social-welfare-school/article-19740

Tags: