తెలంగాణ రక్షణ సేన  పార్టీ జెండా ఆవిష్కరణ

తెలంగాణ రక్షణ సేన  పార్టీ జెండా ఆవిష్కరణ

విశ్వంభర, సంగారెడ్డి: తెలంగాణ రక్షణ సేన సంగారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి  కలబ్‌గూర్ దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కంది మండలం కంది గ్రామం, కొండాపూర్ మండలం తోగర్‌పల్లి గ్రామాల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కలబ్‌గూర్ దయాకర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క పిలుపు మేరకు పంచజన్య సిద్ధాంతాలతో ప్రతి ఊరు, ప్రతి వాడలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాను ఎగురవేస్తూ పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లి, తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజా హక్కులు, సామాజిక న్యాయం మరియు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతామని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తెలంగాణ రక్షణ సేనను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెండా పండుగ ఇన్‌చార్జి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పరిశీలకులు మురళీకృష్ణ, శంకర్ నాయక్, అలాగే పార్టీ నాయకులు కంది ప్రదీప్, ధనుష్, వేణు, సురేష్, సందీప్, అరవింద్, అరుణ్, అనిల్, శివ, అఖిల్, భరత్, ఎం. రాహుల్ యాదవ్, బి. వేణు, డి. శివకుమార్, ఎం.డి. జుబేర్, ఎ. హర్ష, ఎం.డి. ఆసిఫ్, ఎం.డి. ముజ్జు, గొప్పల్ రెడ్డి, మనోజ్ రెడ్డి, రజనీకాంత్, కృష్ణమోహన్, సాయికాంత్ గౌడ్, శరణ్ నితిన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, యువత, మహిళలు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాలను విజయవంతం చేసి, తెలంగాణ రక్షణ సేనను గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సంకల్పించారు.

🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/inauguration-of-telangana-raksha-sena-party-flag/article-19797

Tags: