ఇబ్బందులను అధికమించి విజయం సాధించిన హిమబిందు
- కళాశాల ప్రిన్సిపాల్ సదానందం అభినందనలు
విశ్వంభర, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బైపిసి గ్రూప్ తీసుకొని చదువుతున్న సుంకరి హిమబిందు తెలంగాణ రాష్ట్రంలో నిన్న వెలువడిన ఇంటర్ ప్రధమ , ద్వితీయ సంవత్సరం ఫలితాలలో భాగంగా బైపిసి విభాగంలో 1000 మార్కులకు గాను 985 మార్కులు సాధించిందని ప్రిన్సిపాల్ పోక్కుల సదానందం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ , విద్యార్థిని సుంకరి హిమబిందు చిన్న వయసులోనే ఆమె తండ్రిని కోల్పోయి, వివాహo తర్వాత భర్తను కోల్పోయి చిన్న పాపతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చిందని, సావిత్రిబాయి పూలే స్ఫూర్తిని తీసుకొని ఇంటర్మీడియట్ ఫలితాల్లో 985 మార్కుల సాధించి నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచిందని ప్రిన్సిపాల్ గుర్తు చేశారు అన్నారు. అనంతరం విద్యార్థినిని కళాశాల ప్రిన్సిపాల్ , అధ్యాపక బృందం అభినందించారు. విద్యార్థిని సుంకరి హిమబిందు మీడియాతో మాట్లాడుతూ, ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్న , నాకు ఎవరైనా ఆర్థిక పరంగా సాయం చేస్తే నాతో పాటు మా పాపను కూడా చదివిస్తూ మంచి ఫలితాలను తీసుకొస్తానని తెలిపారు.



