గుట్టయ్య గౌడ్ కు అస్వస్థత
On
- కాంగ్రెస్ నాయకుల పరామర్శ
విశ్వంభర, నెల్లికుదురు: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత, కిసాన్ కాంగ్రెస్ స్టేట్ కోఆర్డినేటర్ నెల్లికుదురు మండలం నైనాల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ జిల్లా నాయకులు కాసం లక్ష్మారెడ్డి, గంకిడి ఎల్లారెడ్డి, గూదె యుగంధర్ తదితరులు సోమవారం ఆసుపత్రికి వెళ్లి గుట్టయ్య గౌడ్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం పై ఆరా తీశారు. వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.



