దాహార్తి తీర్చేందుకే చలివేంద్రాలు
విశ్వంభర, సూర్యాపేట: వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చలివేంద్రాల ఏర్పాటుకు సుధాకర్ గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ ప్రెవేట్ లిమిటెడ్ సహకరించడం అభినందనియమని సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్ష్యాది తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట, 48వ వార్డు కూరగాయల మార్కెట్ వద్ద సుధాకర్ గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ ప్రెవేట్ లిమిటెడ్, మున్సిపాలిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, మున్సిపల్ కమిషనర్ సిహెచ్. హనుమంత రెడ్డి,సుధాకర్ ప్రోడక్ట్స్ అఫ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ మీలా మహదేవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎండలు రోజురోజుకు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతి సంవత్సరం చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వడదెబ్బ, డిహైడ్రేషన్ వంటి సమస్యలు రాకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వేసవి కాలంలో స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, కౌన్సిలర్లు కొనతం రాజేష్, వెలుగు వెంకన్న, మున్సిపల్ ఈఈ కిరణ్, డీఈ సత్యారావు, జూనియర్ అసిస్టెంట్ ఎస్‌ఎస్‌ఆర్ ప్రసాద్, పివిసి శర్మ, కోడి శివ తదితరులు పాల్గొన్నారు.



