నాదెండ్ల పార్ధీవ దేహానికి నివాళులర్పించిన రవి
On
విశ్వంభర, రామన్నపేట: కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు అనారోగ్య కారణాలతో మృతి చెందగా, విషయం తెలుసుకున్న భువనగిరి జిల్లా సర్దార్ సర్వాయి పాపన్న గీతకార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు, యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలానికి చెందిన కప్పల రవి హైదరాబాదులోని నాదెండ్ల భాస్కరరావు స్వగృహంలో ఆయనకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆయన మరణ వార్త విని తీవ్రంగా దిగ్భ్రాంతికి గురైనానని అన్నారు. ఆయన మరణం రాజకీయ రంగానికి మాత్రమే కాకుండా, సమాజానికి కూడా తీరని లోటని, ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు తన హృదయ పూర్వక సానుభూతి తెలియజేస్తూ, పరమపదించిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు.



