హరీశ్‌రావుపై దుష్ప్రచారం ఆపండి

హరీశ్‌రావుపై దుష్ప్రచారం ఆపండి

విశ్వంభర, సిద్దిపేట: జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభకు మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరుకాకపోవడంపై కాంగ్రెస్ మంత్రులు, నాయకులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు కాముని శ్రీనివాస్, సోమిరెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ పని మీద ఢిల్లీకి వెళ్లితే కాంగ్రెస్ నాయకులు కొంపలు మునిగినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలు, గ్యారంటీలపై ప్రజలకు సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ అంతర్గత విషయాలపై మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. హరీశ్‌రావు జీవితం కేసీఆర్‌కే అంకితమని, ఇప్పటికే పలుమార్లు హరీశ్‌రావు ఈ విషయాన్ని స్పష్టం చేశారని వారు గుర్తుచేశారు. సమావేశంలో కోల రమేశ్, పాపయ్య, జంగిటి శ్రీనివాస్, బాబు, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: