మహిళా రిజర్వేషన్‌లో ఓబీసీకి అవకాశం కల్పించాలి
On
విశ్వంభర, న్యూఢిల్లీ : నారీ శక్తి వందన్ అధినియంలో ఎస్టీ, ఎస్సీ మహిళలతో పాటు ఓబీసీ మహిళలను కూడా చేర్చాలని కోరుతూ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లులో అన్ని వర్గాల మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని కోరుతూ పోస్టు కార్డు మీద సంతకం చేసి తన అభ్యర్థనను తెలియజేశారు. మహిళల రాజకీయ ప్రాతినిధ్యం విస్తరించాలంటే ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ అవసరమని పేర్కొన్నారు.



