గృహప్రవేశాలతో లబ్ధిదారుల్లో ఆనందం
- :ఎమ్మెల్యే డా.మురళి నాయక్
:
విశ్వంభర, నెల్లికుదురు: ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలతో లబ్ధిదారుల్లో ఆనందం వెల్లి విరుస్తోందని ఎమ్మెల్యే డా. భూక్యా మురళి నాయక్ అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం పేదలను ఓటు బ్యాంకుగా వాడుకుందని, కనీసం ఇల్లు కూడా ఇవ్వాలనే సోయి లేదని విమర్శించారు. నెల్లికుదురు మండలం నర్సింహుల గూడెం లో గురువారం ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు పొన్నం స్వాతి మహేష్ దంపతుల గృహప్రవేశ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఎక్కడో ఒక చోట ఇండ్లు ఇచ్చినా అవి పేరున్న లీడర్లు తీసుకొని పేదల కళ్ళలో మట్టి కొట్టారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఇండ్లు కేటాయించి నిర్మాణాలు చేపట్టి గృహప్రవేశాలు జరుగుతుండడంతో కొందరికి కంటగింపుగా ఉందన్నారు. ఎవరికి ఏమైనా మా ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కర్తవ్యం గా భావిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజల ఆకలి తీర్చేందుకే కొత్త రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యం అందజేస్తున్నట్లు తెలిపారు. మహిళల ప్రయాణానికి ఫ్రీ బస్సు తో పాటు, వడ్డీ లేని రుణాలు, గ్యాస్ పై సబ్సిడీ, ఇండ్లకు ఫ్రీ కరెంట్ వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మద్దినేని ఐలయ్య, బండిగుట్టయ్య, బేతమల్ల నవీన్,వద్ది నాగరాజు పెదగాని పెద్ద నరసయ్య,జంగిలి నరేష్,పగిడిపాటి గుట్టయ్య తదితరులు పాల్గొన్నారు.



