చండూరు ప్రజా పాలన వార్డు సభలో రసాభాస  - ఇదేమి ప్రభుత్వం... ఇదేక్కడి న్యాయం.. 

చండూరు ప్రజా పాలన వార్డు సభలో రసాభాస  -  ఇదేమి ప్రభుత్వం... ఇదేక్కడి న్యాయం.. 

ఆగ్రహించిన వార్డు ప్రజలు 

విశ్వంభర, చండూరు:  పట్టణంలోని 8వ వార్డులో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం గురువారం నిర్వహించినా వార్డు సభ రసాభాసగా జరిగింది. 228 మంది ఇండ్లకు దరఖాస్తు చేసుకోగా అందులో 110 మందికి ఇండ్లు, రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు రాకుండానే గతంలో ఆన్లైన్లో చేసుకున్న వారి పేర్లు చదవటం ఏంటది చండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తోకల చంద్రకళ-వెంకన్న, 8వ వార్డ్ కౌన్సిలర్ తోకల వెంకన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డులో తిరిగి ఇల్లు లేని వారికి, కూలిపోయిన వారికి ఇల్లు ఇవ్వాలని, ఇండ్లు ఉన్నవారికి ఇవ్వటం ఏంటని నిలదీశారు. ఇక్కడ తప్పుడు సమాచారంతో ఇక్కడ వార్డు సభ నిర్వహించొద్దంటూ  ప్రజలు అక్కడికి వచ్చిన అధికారుల పైన ధ్వజమెత్తారు. అర్హత ఉన్న వారికే సంక్షేమ పథకాలు మంజూరు చేస్తామని అధికారులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తూ పేదవాళ్లకు అన్యాయం చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.    ఇదేమి ప్రభుత్వం..ఇదేక్కడి న్యాయం అంటూ వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags: