ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆద్వర్యం లో ఘనంగా " రామ్ మనోహర్ లోహియా జయంతి వేడుకలు " 

రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలే స్ఫూర్తి గా ఉద్యమకారుల కోసం పోరాటం : కాచం సత్యనారాయణ - రామ్ మనోహర్ లోహియా ఆశయాల, సిద్ధాంతాల పునాది గా  రాజకీయ పార్టీలు రావాలి : పాశం యాదగిరి 

ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆద్వర్యం లో ఘనంగా

హైదరాబాద్: ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ ఆధ్వర్యములో డాక్టర్ రామ్ మనోహర్ లోహియా జయంతి వేడుకలు కొత్తపేట చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  సీనియర్ జర్నలిస్ట్ , ఉద్యమకారులు పాశం యాదగిరి, భూదాన్ బోర్డు చైర్మన్ రాజేందర్ రెడ్డి, టీయూసీసీ చైర్మన్ మురళీధర్ దేశ్ పాండే హాజరయ్యారు . ఈ సందర్భంగా రామ్ మనోహర్ లోహియా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు . ఈ సందర్బంగా కాచం సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో చాలామంది గొప్ప గొప్ప నాయకుల గురించి తెలుసుకున్న సందర్భంలో తెలంగాణ గాంధీ అయినటువంటి భూపతి కృష్ణమూర్తి, జైని మల్లయ్య, జాతీయస్థాయిలో రామ్ మనోహర్ లోహియా గురించి తెలుసుకోవడం జరిగిందన్నారు. రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాల గురించి కీర్తిశేషులు నిజాం వెంకటేష్ తనకు పూర్తిస్థాయిలో వివరించారని తెలిపారు. ఈ నేపథ్యంలో నే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో  వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వైశ్య గర్జన కార్యక్రమంలో సభ ప్రాంగణానికి రామ్ మనోహర్ లోహియా పేరుని పెట్టి ఆయనపై మాకు ఉన్న అభిమానాన్ని,గౌరవాన్ని చాటు కోవడం జరిగిందన్నారు. అలాగే ఆయన ఆశయాలను సిద్ధాంతాలను ప్రజలందరికి  తెలియాలని ఆయన పేరుపెట్టడం జరిగింది అన్నారు. రామ్ మనోహర్ లోహియా స్థాపించిన సోషలిస్టు పార్టీ లొ ఆయనకు ప్రధానమైన ఇద్దరు శిస్యులు మూలయం సింగ్, లాలు ప్రసాద్ యాదవ్ లు ఆయన ఆశయ సిద్ధాంతాలను అలవర్చుకొని రెండు రాష్ట్రలకు ముఖ్యమంత్రులు అయ్యారని కాచం సత్యనారాయణ గుర్తు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై మాట్లాడుతున్నటువంటి బీసీ నాయకులు కూడా రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలను ఆశయాలను ఆదర్శముగా  తీసుకొని ముందుకు వెళితే  తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా మొత్తం బీసీలకు న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్ళవచ్చు అని తెలిపారు. భారతదేశ స్వాతంత్రం కోసం లోహియా చేసిన త్యాగాలను, అలాగే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారులు పడ్డ కృషిని స్ఫూర్తిని తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.తెలంగాణ రాష్టం సాధించే కార్యక్రమం లొ ఎందరో మనది గొప్ప ఉద్యమ నాయకులతో పని చేసి అవకాశం వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమం లొ నాటి నుండి నేటి వరకు తన వెంట ఉండి తనను ముందుకు నడిపిస్తున్న వారందరికి ఈ సందర్భముగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. గాంధీజీ, లోహియా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ సిద్ధాంతాలను అలవర్చుకొని రానున్న రోజుల్లో మనకున్న న్యాయపరమైన హక్కుల కోసం తెలంగాణ అమరుల ఆశయాల కోసం, ఉద్యమ కారులు కోసం కొట్లాడుతానని కాచం తెలిపారు. ఎన్నికల సమయం లొ కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టో లొ ఇచ్చిన హామీ ప్రకారం, ఉద్యమ కారులకు న్యాయం జరిగే విధంగా తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మిగతా అన్ని సంఘాలను, మేధావులను కలుపుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి , ఉద్యమకారులకు న్యాయం జరిగేంత వరకు తాను పోరాడుతానని కాచం సత్యనారాయణ స్పష్టం చేసారు .  
 
సీనియర్ జర్నలిస్ట్ , ఉద్యమకారులు పాశం యాదగిరి మాట్లాడుతూ డాక్టర్ రామ్ మనోహర్ లోహియా  భారతదేశ రాజకీయ, సామాజిక చరిత్రలో తన జీవితాంతం తన సూత్రాలకు, దేశభక్తి విలువలకు కట్టుబడి ఉన్న మహనీయులలో ఒకరు అని తెలిపారు . మహిళా విద్య, సామాజిక సమానత్వం, రాజకీయ స్వచ్ఛతపై ఆయన ఆలోచనలు అందరికీ స్ఫూర్తిదాయకం అని తెలిపారు . సామాజిక న్యాయానికి ప్రతీక అయిన ఆయన, అణగారిన వర్గాల సాధికారతకు మరియు బలమైన భారతదేశ నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేశారన్నారు . కులాలు మతాలు ప్రాంతాల మధ్య సమానత్వం తీసుకురావాలని లోహియా  పోరాడారని చెప్పారు . రామ్ మనోహర్ లోహియా కళలు కన్నా సోషలిజం కోసం మనం అందరం కలిసి పనిచేయా లన్నారు. ఆయన చెప్పిన విధంగా దేశం లో నాలుగు స్తంభాలు , గ్రామం , జిల్లా, రాష్ట్రం , కేంద్రం గా పాలన ఉండాలని ఆయన చెప్పారని తెలిపారు.  గ్రామా స్వరాజ్యం రావాలన్నిది ఆయన కల అని తెలిపారు. కులాలు , మతాలు ,సంపన్నులు, పేదోళ్లు, అనే తేడా ప్రజల మధ్య ఉండకూడని ఆయన ఆశయం అన్నారు. రామ్ మనోహర్ లోహియా ఆశయాల, సిద్ధాంతాల పునాది గా  రాజకీయ పార్టీలు రావాలన్నారు. అట్టడుగున ఉన్న ప్రజలే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలన్నారు. రామ్ మనోహర్ లోహియా ఆశయ సిద్ధాంతాలను అనుగుణంగా కొత్త రాజకీయ పార్టీ ఆవశ్యకత ఉందని , దానికోసం కాచం సత్యనారాయణ ముందుండాలని ఆయన కోరారు . 
 
భూదాన్ బోర్డు చైర్మన్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజుల్లో మహాత్మా గాంధీజీ,నెహ్రు,సుభాష్ చంద్రబోస్,ఆజాద్ లాంటి గొప్ప స్వాతంత్ర  సమర యోధుల త్యాగాలను  మర్చిపోతున్న సమయంలో రామ్ మనోహర్ లోహియా జన్మదినాన్ని గుర్తు పెట్టుకొని ఆయన జయంతి వేడుకలను ఘనంగా  చేస్తున్న కాచం సత్యనారాయణ నిర్ణయం అభినందనీయం అన్నారు . భారత దేశ స్వాతంత్రములో  రామ్ మనోహర్ పాత్ర గొప్పదని అన్నారు . దేశం లో ఉన్న కులాల మధ్య అసమానతలు తొలగాలని ఆయన సిద్ధాంతం అన్నారు.
ఈ కార్యక్రమం లో పల్లె వినయ్ కుమార్ గౌడ్,బీరెల్లి వెంకట్ రెడ్డి ,ఉప్పల శ్రవణ్ కుమార్,దర్శన్, కూర రమేష్,శ్రీనివాస్,మధు,నర్సిరెడ్డి,శేఖర్,రామ్ కోటి,మహేందర్,రాజు యాదవ్, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నాయకులూ,ఉద్యమకారులు,విద్యార్ధి నాయకులూ, తదితరులు పాల్గొన్నారు

Tags: