క్యాన్సర్ చికిత్సలో సరికొత్త విప్లవం: హైటెక్ సిటీ యశోద
ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ (క్యాన్సర్ నిపుణులు) డాక్టర్ శిఖర్ కుమార్
On
- హాస్పిటల్స్‌లో అత్యాధునిక ‘ఇన్-హౌస్ ఎన్ జి ఎస్’ సేవలు ప్రారంభం!
- సమగ్ర జన్యు పరీక్షల ద్వారా క్యాన్సర్ రోగులకు వ్యక్తిగతీకరించిన చికిత్స
- రిపోర్టుల వేగవంతం, ఊపిరితిత్తులు, రొమ్ము, జీర్ణాశయ క్యాన్సర్ రోగులకు ఎంతో మేలు.
విశ్వంభర, హనుమకొండ :- క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స రంగంలో సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెస్తూ.. హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ తాజాగా ‘ఇన్-హౌస్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్’ (ఎన్ జి ఎస్) సదుపాయాన్ని ప్రారంభించింది. క్యాన్సర్ రోగుల జన్యు నిర్మాణాన్ని విశ్లేషించి, వారికి అత్యంత ఖచ్చితమైన, వ్యక్తిగతీకరించిన వైద్యం అందించడంలో ఈ సాంకేతికత కీలక మైలురాయిగా నిలవనుంది. గురువారం రోజున హనుమకొండ యశోద క్లినిక్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ (క్యాన్సర్ నిపుణులు) డాక్టర్ శిఖర్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వైద్యరంగం సాంప్రదాయ "అందరికీ ఒకే రకమైన చికిత్స" విధానం నుండి ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఆధునిక చికిత్సలైన టార్గెటెడ్ ఓరల్ థెరపీలు, ఇమ్యూన్ చెక్‌పాయింట్ ఇన్హిబిటర్స్ వంటి రోగుల జీవనకాలాన్ని, వారి జీవన నాణ్యతను గణనీయంగా పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో, యశోద హాస్పిటల్స్ సొంతంగా (ఇన్-హౌస్) ఈ ఎన్ జి ఎస్ ల్యాబ్ ఏర్పాటు చేయడం విశేషం.ఇన్-హౌస్ ఎన్ జి ఎస్ వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు, వేగవంతమైన నివేదికలు, ఆసుపత్రి ప్రాంగణంలోనే ఈ పరీక్షలు నిర్వహించడం వల్ల రోగి యొక్క జన్యుపరమైన మార్పులను అత్యంత వేగంగా, ఖచ్చితంగా గుర్తించవచ్చును. పరీక్షా ఫలితాల ఆధారంగా ఆంకాలజిస్టులు ప్రతి రోగి ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా చికిత్సను డిజైన్ చేయడానికి వీలవుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల (Lung), రొమ్ము (Breast), జీర్ణాశయ సంబంధిత (Gastrointestinal) క్యాన్సర్లతో పాటు ఇతర కణితుల (Tumors) చికిత్స నిర్ణయాలలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది."సొంతంగా ఎన్ జి ఎస్ సదుపాయాన్ని ప్రారంభించడం ద్వారా ప్రెసిషన్ ఆంకాలజీ విభాగంలో యశోద హాస్పిటల్స్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. అత్యాధునిక సాంకేతికతను రోగులకు మరింత వేగంగా, చేరవ చేయడమే మా లక్ష్యం." అని ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది.ఒకే గూటి కింద ప్రపంచ స్థాయి క్యాన్సర్ కేర్‌హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్‌లో ఇప్పటికే అత్యంత అనుభవజ్ఞులైన మల్టీడిసిప్లినరీ క్యాన్సర్ నిపుణుల బృందం అందుబాటులో ఉంది. అత్యాధునిక రోబోటిక్ ఆంకోసర్జరీ, భారతదేశంలోనే తొలి రేడియేషన్ థెరపీ వ్యవస్థలతో పాటు, ఇప్పుడు ప్రారంభమైన ఎన్ జి ఎస్ సదుపాయంతో క్యాన్సర్ రోగులకు ఒకే చోట పూర్తిస్థాయి, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సమగ్ర వైద్య సేవలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో హాస్పటల్ సిబ్బంది సాయి వెంకట్, విజయ్ కుమార్, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.
🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-latest-revolution-in-cancer-treatment-is-hi-tech-city-yashoda/article-18815