క్రీడాభిమానులకు, మద్యం ప్రియులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్
తెల్లవారుజామున 3:00 గంటల వరకు మద్యం అమ్మకాలకు లైసెన్స్
On
- 18వ తేదీన జరిగే ఫిఫా వరల్డ్ కప్ థర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్ మ్యాచ్.
- ఈ మ్యాచ్ సందర్భంగా 19వ తేదీ తెల్లవారుజామున 4:30 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి.
- 19వ తేదీన జరిగే అత్యంత ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.
- ఫైనల్స్ రోజున అర్ధరాత్రి నుంచి 20వ తేదీ తెల్లవారుజామున 3:00 గంటల వరకు మద్యం అమ్మకాలకు లైసెన్స్
విశ్వంభర,హైదరాబాద్ : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్నే పథ్యంలో తెలంగాణ క్రీడాభిమానులకు, మద్యం ప్రియులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మెగా టోర్నీని పురస్కరించుకుని రాష్ట్రంలో తెల్లవారుజాము వరకు మద్యం అమ్మకాలకు అనుమతినిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవలే పొరుగు రాష్ట్రం కర్ణాటక కూడా ఇదే తరహా నిర్ణయాన్ని ప్రకటించగా.. ఇప్పుడు కర్ణాటక బాటలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా పయనించింది. అయితే ఈ ప్రత్యేక వెసులుబాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైన్ షాపులకు వర్తించదు. కేవలం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (Core Urban Region) పరిధిలోని బార్లు, లగ్జరీ క్లబ్బులు, మైక్రోబ్రూవరీలకు మాత్రమే ఈ అర్ధరాత్రి విక్రయాల అనుమతి వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో అటు ఫుట్‌బాల్ ప్రేమికులు, ఇటు బార్ల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
🕒 17 Jul 2026 ✍️ Desk
క్రీడాభిమానులకు, మద్యం ప్రియులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్
తెల్లవారుజామున 3:00 గంటల వరకు మద్యం అమ్మకాలకు లైసెన్స్
విశ్వంభర,హైదరాబాద్ : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్నే పథ్యంలో తెలంగాణ క్రీడాభిమానులకు, మద్యం ప్రియులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మెగా టోర్నీని పురస్కరించుకుని రాష్ట్రంలో తెల్లవారుజాము వరకు మద్యం అమ్మకాలకు అనుమతినిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవలే పొరుగు రాష్ట్రం కర్ణాటక కూడా ఇదే తరహా నిర్ణయాన్ని ప్రకటించగా.. ఇప్పుడు కర్ణాటక బాటలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా పయనించింది. అయితే ఈ ప్రత్యేక వెసులుబాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైన్ షాపులకు వర్తించదు. కేవలం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (Core Urban Region) పరిధిలోని బార్లు, లగ్జరీ క్లబ్బులు, మైక్రోబ్రూవరీలకు మాత్రమే ఈ అర్ధరాత్రి విక్రయాల అనుమతి వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో అటు ఫుట్‌బాల్ ప్రేమికులు, ఇటు బార్ల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
🔗 https://www.vishvambhara.com/telangana/good-news-for-telangana-sports-fans-and-alcohol-lovers/article-18813