చేనేత మగ్గాల గుంటలోకి వర్షపు నీరు.

-స్పందించిన అధ్యక్షులు రాపోలు వీర మోహన్ 

చేనేత మగ్గాల గుంటలోకి వర్షపు నీరు.

విశ్వంభర, హైదరాబాద్ / చండూర్:- గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రం లో చేనేత కార్మికుల ఇండ్లలోకి మగ్గాల గుంతలోకి వర్షపు నీరు చేరి విలువైన పట్టు చీరలు, నూలు చీరలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. విలువైన పట్టు దారం, చీరలు ధ్వంసం కావడం తో చేనేత కార్మికులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు.  రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. చేనేత కార్మికులను ఆదుకొని వారికి ప్రభుత్వం నుండి సహకారం అందించాలని తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ కోరారు.నల్లగొండ జిల్లా చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు ద్వారక్ తో రాపోలు వీర మోహన్ ఫోన్ లో సంభాషించి పరిస్థితిని వివరించారు. వారు వెంటనే వారి అధికారులను
చండూరు కు పంపించి నివేదిక తెప్పించుకుని జిల్లా కలెక్టర్ కి నివేదిక పంపిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా వీర మోహన్ మాట్లాడుతూ ఇలాంటి ఉపద్రవాలు సంభవించినప్పుడు రైతుల మాదిరి, చేనేత కార్మికులను కూడా ఆదుకొని నష్ట  పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 

Tags: