రూ.30 కోట్లతో ఓట్లు కొనుగోలు.. బీఆర్ఎస్‌పై రఘునందన్ ఈసీకి ఫిర్యాదు!

రూ.30 కోట్లతో ఓట్లు కొనుగోలు.. బీఆర్ఎస్‌పై రఘునందన్ ఈసీకి ఫిర్యాదు!

తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. అసెంబ్లీ ఎన్నికల రేంజ్‌లో జరుగుతోంది. సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవాలని బీఆర్ఎస్, అధికారంలో ఉన్నా కాబట్టి తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ ఎమ్మెల్సీని గెలుచుకుంటే తెలంగాణలో నిజమైన ప్రతిపక్షం తమదేనని అనిపించుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. మొత్తానికి ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగింది. ఇంకా పోలింగ్‌కు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. దీంతో అన్ని పార్టీలు ప్రలోభాలకు తెరలేపారు. 

 

Read More మానవత్వం చాటుకున్న మహారాజు

బీఆర్ఎస్‌పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రూ. 30 కోట్లతో బీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఓట్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. అంతేకాదు.. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాశారు. ఆ లేఖతో పాటు కొన్ని బ్యాంక్ ఖాతాలు కూడా జత చేశారు. ఆ అకౌంట్స్ ను ఫ్రీజ్ చేయాలని కోరారు. ఎన్నికలు రాజ్యాంగ బద్ధంగా జరగాలంటే బీఆర్ఎస్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.  

 

Read More మానవత్వం చాటుకున్న మహారాజు

ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ రేపు జరగనుంది. మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోటీలో 52 మంది ఉన్నా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా అశోక్ కుమార్ కూడా కొంత ప్రభావం చూపేలా కనిపిస్తున్నారు.