డబుల్ బెడ్రూమ్ బాధితుల నిరసన

డబుల్ బెడ్రూమ్ బాధితుల నిరసన



విశ్వంభర, మహబూబ్ నగర్:  పట్టణంలోని డబల్ బెడ్ రూమ్ బాధితులు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఉన్న అమరవీరుల స్తూపం దగ్గర  నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా టి ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం. ఖలీల్ మాట్లాడుతూ,  దిక్కుమొక్కు లేని పేద ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదించడం సిగ్గుచేటు అన్నారు. గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ప్రజలు జీర్ణం చేసుకోలేకపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైన తమకు న్యాయం చేస్తుందని వారు ఆశలతో ఉన్నారన్నారు. యన్నం శ్రీనివాస్ రెడ్డి గారు చొరవ తీసుకొని బాధితులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారికి న్యాయం జరగకుంటే చట్టాలపై,ప్రభుత్వ అధికారులపై, ప్రజా ప్రతినిధులపై విశ్వాసాన్ని కోల్పోయి ప్రజలు డబల్ బెడ్ రూమ్లో తాళాలు పగలగొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు  తద్వారా జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. చైతన్య మహిళా సంఘం నాయకురాలు శ్రీదేవి మాట్లాడుతూ,  మహబూబ్నగర్ పట్టణ పేదలకు తాము అండగా ఉంటామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, హైకోర్టు న్యాయమూర్తి గారికి ఉత్తరాలు రాస్తామన్నారు. అన్ని పార్టీల రాష్ట్ర, జిల్లా నాయకులను కలిసి సంఘీభావం కోరుతామన్నారు. సబ్బండ వర్గాల మద్దతుతో డబల్ బెడ్ రూమ్ బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు జి గట్టన్న, ఎండి జలాల్ పాషా, డబల్ బెడ్ రూమ్ బాధితులు మాధవి, శ్రీదేవి, హనీఫా బేగం, షాహిదా బేగం, లలిత, లక్ష్మీదేవి, ఎండి బషీరుద్దీన్, సద్దాం హుస్సేన్, మధులత తదితరులతో పాటు వందలాది సంఖ్యలో డబల్ బెడ్ రూమ్ బాధితులు పాల్గొన్నారు.

Read More హరీశ్, కేటీఆర్‌లపై కవిత ఘాటు విమర్శలు

Tags: