పిఆర్సి , డిఎ పెండింగ్ లను వెంటనే ప్రకటించాలి . -టిపియుఎస్ రాష్ట్ర అధ్యక్షులు వో డ్నాల రాజశేఖర్ .

పిఆర్సి , డిఎ పెండింగ్ లను వెంటనే ప్రకటించాలి . -టిపియుఎస్ రాష్ట్ర అధ్యక్షులు వో డ్నాల రాజశేఖర్ .

విశ్వంభర,మహబూబాబాద్ జిల్లా :   జిల్లా కేంద్రంలో నీ గాదే రుక్మారెడ్డి మెమోరియల్ హై స్కూల్  టిపియూఎస్  జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిబోయిన గోపికృష్ణ ,  ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి  జిల్లా కార్యవర్గ సమావేశంలో తీపి యు.ఎస్  రాష్ట్ర అధ్యక్షులు వోడ్నల రాజశేఖర్  మాట్లాడుతూ  పిఆర్సి  ను  వెంటనే ప్రకటించి  అమలు చేయాలి అని  రిటర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి . గత ప్రభుత్వం చేసిన తప్పులే మళ్ళీ ఈ ప్రభుత్వం చేస్తుంది అని గుర్తు చేశారు, మరియు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య  మాట్లాడుతూ  పెండింగ్ DA లు మరియు పెండింగ్ బిల్లుల వెంటనే చెల్లించాలి 317 బాధితులకు న్యాయం చేయాలి 190 G.O డిప్యుటేషన్ లను పూర్తి చేయాలి ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు సి పి ఎస్ ,రద్దు చేసి  ఓ పి ఎస్  ను అమలు చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .సంగం  రాష్ట్ర కల్చరల్  వింగ్  కన్వీనర్ జిల్లా వాణి దేవి  మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుంది ,  ఆకునూరు మురళి కమిషన్ ద్వారా ఉపాద్యాయుల జీతాల  గురించి మాట్లాడటం ఉపాధ్యాయులను బాద్యులు చేయడం ను తీవ్రంగా ఆక్షేపించారు . ఎన్యి పి 2020 అమలు చేయాలి, అని TPUS రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తున్నది అని వారు అన్నారు .ఈ కార్యక్రమంలో  టీ పి యు.ఎస్  జిల్లా ఉపాద్యక్షురాలు వనం పద్మ , మహబూబాబాద్  మండల అధ్యక్షులు మాధవరావు , కురవి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి లు కందగట్ల వెంకటరమణ, సాంబశివ, ఉపాద్యాయులు , పాల్గొన్నారు .

 

Tags: