అహ్మద్ గూడ వీకర్ సెక్షన్ నూతన కార్యవర్గం
విశ్వంభర , మేడ్చల్ : కీసర సర్కిల్ దమ్మాయిగూడ డివిజన్ అహ్మద్ గూడ ( బండ్లగూడ) వీకర్ సెక్షన్ కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు స్థానిక కాలనీ పెద్దల సమక్షంలో జరిగాయి. మాజీ సర్పంచ్ గండి యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలలో కాలనీ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా జవాజి విజయ్ కుమార్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా సాల్వే దిలీప్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గండి యాదగిరి గౌడ్ మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు కాలనీ అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకుని పనిచేయాలని సూచించారు. కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికై కమిటీ సభ్యులందరూ ఏకతాటిపై నిలిచి, సమష్టి కృషితో ముందుకు సాగాలని ఆయన కోరారు. ఉపాధ్యక్షులుగా వట్టిపల్లి హరికృష్ణ యాదవ్, ఠాకూర్ రాజు సింగ్, కోశాధికారిగా చింతల రాజు ముదిరాజ్, కార్యదర్శులుగా జవాజి మణికంఠ ముదిరాజ్, దండేటికర్ బజరంగ్ లాల్, జాయింట్ సెక్రెటరీగా పల్లె సాయి గౌడ్, కార్యవర్గ సభ్యులుగా కొరివి లక్ష్మీనారాయణ ముదిరాజ్, ఎండీ.ఖలీల్ పాషా, బత్తుల ఎల్లయ్య, ఠాకూర్ భవాని సింగ్, దండగల సతీష్, సనాల సురేష్ చారి, గండి నవీన్ గౌడ్, లంకోజు సాయి కృష్ణ చారి, మనుపాటి పరశురాం ఎన్నికయ్యారు. ముఖ్య సలహాదారులుగా గండి యాదగిరి గౌడ్, చింతల ప్రకాష్ ముదిరాజ్, నరేష్ బుచ్చి రెడ్డి, గండి శ్రీనివాస్ గౌడ్, మస్కే తాతారావు, ఆత్మ రావు, కాలే పరమేష్ గారలు నియమితులయ్యారు.



