వంటగ్యాస్ ధరలు తగ్గించాలి
విశ్వంభర, గుండాల : కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధర లు తగ్గించాలని సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యులు మద్దెపురం రాజు డిమాండ్ చేశారు.పేదలపై భారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ గుండాల మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు.ఈ సంధర్భంగా మద్దెపురం రాజు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచడం అన్యాయమని,అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలకు కానుకగా ఈ ధరలు పెంచారా అని ప్రశ్నించారు.పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే ఉప సంహరించుకొని సాధారణ జనానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సిలిండర్ ధర రూ.500 ఉండగా 13ఏళ్ల కాలంలో వెయ్యి రూపాయలకు పెరిగిందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు అనంతుల అంజయ్య,యండి ఖలీల్,బత్తిని బిక్షం,కొమురయ్య,స్వామి పాల్గొన్నారు.



