తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా వేముల ఉమారాణి నియామకం.

తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా వేముల ఉమారాణి నియామకం.

విశ్వంభర, జగిత్యాల :-తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా వేముల ఉమారాణి ని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహ న్ నేత నియామక పత్రం అందజేశారు. వేముల ఉమారాణి నియామకం పట్ల పలు వురు నాయకులూ హర్షం వ్యక్తం చేశారు. పద్మశాలి చేనేత సామాజిక సంక్షేమం కోసం కృషి చేయాలని పలువురు కోరుతూ హృద య పూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియయజేశారు. ఈ సందర్భంగా వేముల ఉమారాణి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి భాధ్యతను అప్పగించిన అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిరంతరం చేనేత సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. చేనేత వృత్తి పరిరక్షణ కోసం పద్మశాలి జాతి చైతన్యం కోసం తన ఉద్యమ ప్రయాణాన్ని కొనసాగిస్తానని అన్నారు.

 

Tags: